పేరుకేమో పరామర్శ... చేసింది అరాచకం! రైతుల మీద కేసులంటూ అసత్య ప్రచారం!
Mon Jun 16, 2025 11:19 Politics
శాంతిభద్రతలకు విఘాతం కలిగించి ఏపీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయాలని 1 MB వైకాపా అధినేత జగన్ చూస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. పొదిలిలో ఇటీవల మహిళలు, పోలీసులపై వైకాపా కార్యకర్తల రాళ్ల దాడిపై జగన్ చేసిన పోస్టుల్ని చూస్తే ఇందులో కచ్చితంగా కుట్ర కోణం ఉందని తెలుస్తోందన్నారు. జగన్ పొదిలికి వెళ్లింది పొగాకు రైతుల్ని పరామర్శించడానికా లేక విధ్వంసం సృష్టించడానికా అని ప్రశ్నించారు. మహిళలు, పోలీసుల మీద రాళ్లు వేయించడం, ర్యాలీలో 'ఎవరైనా రానీ.. తొక్కిపడేస్తాం' అని ప్లకార్డులు ప్రదర్శించడంలో మీ ఉద్దేశమేంటని నిలదీశారు. పొగాకు రైతుల పరామర్శకు వెళ్తే 'రైతులకు న్యాయం చేయాలి', 'పొగాకు రైతులను ఆదుకోవాలి' అనే ప్లకార్డులు ఉంటాయి గానీ 'తొక్కిపడేస్తాం' అని ప్లకార్డులు ప్రదర్శించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో ఆదివారం మంత్రి విలేకర్లతో మాట్లాడారు.
ఇది కూడా చదవండి: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!
జగన్ ర్యాలీలో మహిళలు, పోలీసులపై జరిగిన రాళ్ల దాడి వీడియోను ప్రదర్శించారు. ‘పొదిలి ఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితులపై గతంలోనే తీవ్రమైన కేసులున్నాయి. అయినా రైతులపై కేసులు పెట్టారంటూ జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న రావూరి చిన్నవెంకటరాజులు మీద 2006లో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మరో నిందితుడు షేక్ మజ్నూపై జగన్ ప్రభుత్వంలోనే హత్యాయత్నం, దోపిడీ కేసులు పెట్టారు. వీరితోపాటు మరో 9 మందిపై కేసులు ఉన్నాయి' అని మంత్రి వివరించారు. 40 వేల మందిమి ఉన్నాం. వంద మంది పోలీసుల మీద దాడి చేస్తే వాళ్లు ఏమైపోతారు', 'పోలీసుల మీద ఎదురు తిరుగుతాం.. ఏదైనా చేసేస్తాం' అని జగన్ మాట్లాడుతున్నారు. ఇలాంటివి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. మీకు రైతు సమస్యలపై చిత్తశుద్ధే ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. జగన్ అసెంబ్లీకి వచ్చిన ఒక్కసారీ పదవి ఇవ్వండని డిమాండ్ చేశారే తప్ప ప్రజా సమస్యలపై ప్రశ్నించారా?" అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అసైన్డ్ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!
తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!
ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!
సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!
ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?
24 గంటలు టైమిస్తున్నా.. లేదంటే తీవ్ర చర్యలు.. వైసీపీకి లోకేశ్ హెచ్చరిక!
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!
వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...
మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!
ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..
ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!
రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!
ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AndhraPradesh #Appolitics #APNews #Kolusu Parthasarathy #Press Meet #Jagan #Comments #Comments on Jagan
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.